Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000052
            [news_title_telugu_html] => 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసిన గావస్కర్‌

[news_title_telugu] => అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసిన గావస్కర్‌ [news_title_english] => Gavaskar meets Trump while on charity fund-raising trip to US [news_short_description] => టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలిశారు. హృద్రోగాలతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాల సేకరణ కోసం న్యూయార్క్‌లోని ట్రంప్‌ బెడ్‌మినిస్టర్‌... [news_tags_keywords] => Sunil Gavaskar,Donald Trump,Charity [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 23:49:42 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసిన గావస్కర్‌ - Gavaskar meets Trump while on charity fund-raising trip to US - EENADU
close

తాజా వార్తలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసిన గావస్కర్‌

దిల్లీ: టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలిశారు. హృద్రోగాలతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాల సేకరణ కోసం న్యూయార్క్‌లోని ట్రంప్‌ బెడ్‌మినిస్టర్‌ గోల్ఫ్‌ కోర్సులో ట్రంప్‌తో మాట్లాడారు.

‘హార్ట్‌ టు హార్ట్‌ ఫౌండేషన్‌ (హెచ్‌2హెచ్‌) సంస్థపై అవగాహన కల్పించేందుకు వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌, టెస్టు సిరీసుల్లో దొరికిన ఖాళీ సమయంలో గావస్కర్‌ తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నవీ ముంబయిలోని శ్రీ సత్యసాయి సంజీవని ఆస్ప్రత్రి సహకారంతో హెచ్‌2హెచ్‌ సంస్థ గుండె జబ్బులున్న చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయిస్తుంది’ అని ఓ ప్రకటనలో నిర్వాహకులు తెలిపారు.

ఇప్పటి వరకు 230 శస్త్రచికిత్సల కోసం గావస్కర్‌ న్యూజెర్సీ, అట్లాంటాలో విరాళాల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం భారత్‌, వెస్టిండీస్‌ సిరీస్‌కు ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు. రెండో టెస్టు ముగిసిన తర్వాత సన్నీ మళ్లీ సిలికాన్‌ వ్యాలీ, లూయిస్‌విలే, ఇండియానా పోలిస్‌, ఫోర్ట్‌ వేన్‌, చికాగోలో పర్యటించి విరాళ సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత భారత్‌కు వచ్చి దక్షిణాఫ్రికా సిరీస్‌కు కామెంటరీ చేస్తారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.