close

తాజా వార్తలు

సచిన్‌ను వెనక్కి నెట్టిన స్మిత్‌!

మాంచెస్టర్‌: ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ యాషెస్‌ సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి టెస్టులో రెండు శతకాలు బాదిన అతడు నాలుగో టెస్టులో డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 26వ శతకం అందుకున్న స్మిత్‌ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను అధిగమించాడు. తక్కువ ఇన్నింగ్స్‌లో 26 సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ను దాటి రెండో స్థానంలో నిలిచాడు. స్మిత్‌ 121 ఇన్నింగ్స్‌ల్లో 26 శతకాలు చేయగా మాస్టర్‌ బ్లాస్టర్‌ 136 ఇన్నింగ్స్‌ల్లో చేశాడు. తొలి స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు డాన్‌ బ్రాడ్‌మన్‌ ఉన్నాడు. అతడు 69 ఇన్నింగ్స్‌ల్లోనే 26 శతకాలు బాదాడు. నాలుగు, ఐదు స్థానాల్లో సునిల్‌ గవాస్కర్‌ (144), మాథ్యూ హెడెన్‌ (145) ఉన్నారు. 

టెస్టుల్లో నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ అయిన స్మిత్‌ తన పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. యాషెస్‌లో వరుసగా ఎనిమిది సార్లు 50+ స్కోరుని సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతడు యాషెస్‌లో ఆఖరి ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 239, 76, 102*, 83, 144, 142, 92, 211 పరుగులు సాధించాడు. రెండో టెస్టులో ఆర్చర్‌ వేసిన బంతికి గాయపడిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో, మూడో టెస్టులో ఆడలేదు. మూడో టెస్టులో బెన్‌స్టోక్స్‌ అద్వితీయమైన పోరాటంతో ఇంగ్లాండ్‌ వికెట్‌ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగో టెస్టులో తిరిగి బరిలోకి దిగిన స్మిత్‌ ద్విశతకంతో జట్టును పటిష్ఠ స్థితిలో నిలిచేలా చేశాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.