close

తాజా వార్తలు

జాతి విద్వేషం: జోఫ్రాకు కేన్‌ క్షమాపణ

వెల్లింగ్టన్‌: ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ జోఫ్రా ఆర్చర్‌కు న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ క్షమాపణలు తెలియజేశాడు. అతడు జాతి విద్వేషానికి గురవడం షాక్‌ కలిగించిందని పేర్కొన్నాడు. బహుళ సంస్కృతులకు నిలయమైన కివీస్‌లో ఇలాంటివి మరోసారి జరగకూడదని అన్నాడు. మౌంట్‌ మాంగనూయి వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లిష్‌ జట్టు ఇన్నింగ్స్‌ 65 పరుగుల తేడాతో ఓడింది. మ్యాచ్‌ ఆఖరి రోజున పోరాడుతున్న ఆర్చర్‌ను ప్రేక్షకుల్లో ఒకరు జాతి విద్వేష వ్యాఖ్యలతో అవమానించారు. ఈ సంగతిని అతడే స్వయంగా ట్వీట్‌ చేశాడు. వెంటనే స్పందించిన న్యూజిలాండ్‌ క్రికెట్‌ సంఘం (ఎన్‌జడ్‌సీ) ఆ ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌కు సోమవారం క్షమాపణలు తెలిపింది. మంగళవారం విషయం తెలుసుకున్న కేన్‌ మరోసారి మన్నించాలని కోరాడు.

‘కివీస్‌ తరఫున జోఫ్రాకు నేను క్షమాపణలు తెలియజేస్తున్నా. కివీస్‌లో ఇలాంటివి ఆశించం. ఇది ఘోరం. బహుళ సంస్కృతులకు నిలయమైన న్యూజిలాండ్‌లో జాతి విద్వేషానికి తావులేదు. ఇలాంటివి మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయం తెలిసి నేను షాకయ్యాను. వీలైతే తప్పకుండా జోఫ్రాను కలుస్తాను’ అని విలియమ్సన్‌ అన్నాడు. న్యూజిలాండ్‌ క్రికెట్‌ సంఘం ఈ కేసును పోలీసులకు అప్పగించింది. మిగతా మ్యాచుల్లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. స్టేడియాల్లో భద్రతను కట్టుదిట్టం చేయనుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.