
తాజా వార్తలు
శాసనసభలో సీఎం జగన్
అమరావతి: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పరిధిలోని రైతుల సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా స్థానిక ఎమ్మెల్యేలను గౌరవ ఛైర్మన్లుగా నియమిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీ సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరుకావడం ద్వారా అక్కడి రైతుల సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశముంటుందన్నారు. శాసనసభలో మార్కెటింగ్ బిల్లు-2019పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఏఎంసీ పరిధిలోని రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా వాటిని పరిష్కరించే వీలు కలుగుతుందని చెప్పారు. అందుకే ఎమ్మెల్యేలను మార్కెట్ కమిటీలకు గౌరవ ఛైర్మన్లుగా నియమించామని జగన్ వివరించారు. రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏఎంసీల పరిధిలో పంటలకు గిట్టుబాటు ధర రాలేదని ఎమ్మెల్యేలు నేరుగా తనతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యేలు తెలిపిన సమాచారంతో మార్కెట్ ఇంటెలిజెన్స్ సోర్స్‌తో పాటు అనేక రకాలుగా ప్రభుత్వం సమాచారం తెప్పించుకుంటుందన్నారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేసేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. ఆ తర్వాత పలువురు సభ్యులు ఈ బిల్లుపై మాట్లాడారు. అనంతరం మార్కెటింగ్ బిల్లు-2019కి శాసనసభ ఆమోదం తెలిపింది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- సినిమా పేరు మార్చాం
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
