Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143380
            [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్‌ - 9AM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్‌ - 9AM [news_title_english] => nine am news [news_short_description] => [news_tags_keywords] => top10,news,9am [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 08:59:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్‌ - 9AM - nine am news - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9AM

1. దరఖాస్తు చేస్తే చాలు: జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు నెలకొల్పాలనుకునేవారికి తమ ప్రభుత్వంలో రేడ్‌టేపిజం అడ్డంకులేవీ ఉండవని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి శుక్రవారం వాషింగ్టన్‌ డీసీలో యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశానికి హాజరయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్థన్‌  ష్రింగ్లాతో సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. అనంతరం యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రసంగించారు.  పరిశ్రమ పెట్టేందుకు ఒక్క దరఖాస్తు చేసుకుంటే చాలని, వారికి కావాల్సిన అనుమతులన్నీ వచ్చేలా ముఖ్యమంత్రి కార్యాలయమే దగ్గరుండి పర్యవేక్షిస్తుందని ఈ సందర్భంగా  చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ప్రభుత్వ మద్యం దుకాణాలు వచ్చేస్తున్నాయ్‌..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు మద్యం దుకాణాలు కనుమరుగుకానున్నాయి. వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) నడిపే దుకాణాలు ప్రత్యక్షం కానున్నాయి. ఈ మేరకు రిటైల్‌ దుకాణాల నిర్వహణను ఆ సంస్థకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసింది. 3,500 దుకాణాలను నిర్వహించనుంది. దుకాణాలపై ప్రదర్శించే సైన్‌బోర్డుల్లో ఏపీఎస్‌బీసీఎల్‌ రిటైల్‌ అవుట్‌ లెట్‌-దాని సంఖ్య మాత్రమే ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఒక్క రోజులోనే  మ్యుటేషన్‌!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించనున్న రెవెన్యూ చట్టంతో కీలక మార్పులు తీసుకురాబోతోంది. భూదస్త్రాల నిర్వహణలో కీలకమైన భూ యాజమాన్య హక్కు బదిలీ (మ్యుటేషన్‌)ని మరింత సరళతరంగా, ఒకే రోజులో, పారదర్శకంగా సేవలు అందించేలా చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టానికి అవసరమైన ముసాయిదా(డ్రాఫ్ట్‌) తయారీని రెండు మూడు భాగాలుగా చేసి కీలకమైన అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా వినోద్‌

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షునిగా ముఖ్యమంత్రి ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రణాళికా సంఘం అత్యంత కీలకమైనది కావడంతో అనుభవజ్ఞుడైన వినోద్‌కుమార్‌ను ఉపాధ్యక్షునిగా నియమించేందుకు సీఎం నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. రీ టెండర్లు విరమించుకోండి

పోలవరం ప్రాజెక్టు టెండర్‌ని రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలన్న (రీ టెండరింగ్‌) నిర్ణయం ఊహించని పరిణామాలకు దారితీస్తుందని, ప్రాజెక్టుని అనిశ్చితిలోకి నెట్టివేస్తుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆందోళన వ్యక్తంచేసింది. రీ టెండరింగ్‌ ఆలోచన విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించింది. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్‌ ప్రకటనకు సిద్ధమవుతూ.. శుక్రవారం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో.. ప్రాజెక్టు అథారిటీ ఈ సూచనలు చేయటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ఉద్ధృత

7. రహస్య సంప్రదింపులు

జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి అసాధారణ రీతిలో రహస్య సంప్రదింపులు జరిపింది. పాకిస్థాన్‌ సర్వకాల మిత్రదేశమైన చైనా ఇచ్చిన లేఖ ఆధారంగా ఈ భేటీ జరిగింది. ఇలాంటి రహస్య సమావేశంలో సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఇష్టాగోష్ఠి చర్చలుగా పరిగణిస్తారు. అందువల్ల దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడదు. అయితే ‘‘భద్రతా మండలిలోని సభ్యులను పరిశీలిస్తే.. వారెవరూ పాక్‌కు అనుకూలంగా ఉన్నట్టు కనిపించడం లేదు’’ అని ఆ దేశానికి చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘డాన్‌’ కథనాన్ని ప్రచురించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. డిసెంబరు 8న సీటెట్‌

కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటీఈటీ)ను డిసెంబరు 8న నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆగస్టు 19 నుంచి సెప్టెంబరు 18వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు www.ctet.nic.inలో ఆగస్టు 19వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. లండన్‌లో పాక్‌ ముఠాల విధ్వంసం

బ్రిటన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయం వద్ద శాంతియుతంగా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొంటున్న ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్‌ అనుకూల బృందాలు దాడులకు తెగబడ్డాయి. రాళ్లు, బాటిళ్లు, కోడిగుడ్లు, పండ్లు, బంగాళ దుంపలు, బూట్లు విసరడం ద్వారా విధ్వంసాన్ని సృష్టించాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఖలిస్థాన్‌, కశ్మీర్‌ జెండాలతో భారీగా నిరసనకారులు గురువారం లండన్‌లోని హైకమిషన్‌ కార్యాలయం వద్దకు వచ్చారు. వీరిలో వందల మంది రౌడీలు, నేరగాళ్లు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. మైనర్‌ బాలికపై పంచాయతీ పెద్దల దాడి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.