Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001064
            [news_title_telugu_html] => 

గ్రిల్స్‌కి హిందీ అలా అర్థమైంది.. మోదీ

[news_title_telugu] => గ్రిల్స్‌కి హిందీ అలా అర్థమైంది.. మోదీ [news_title_english] => Technology helped Bear Grylls understand Hindi modi [news_short_description] => బ్రిటన్‌కు చెందిన సాహసవీరుడు బేర్‌ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని మోదీ చేసిన మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ షో అత్యంత ప్రేక్షాదరణ పొంది విషయం తెలిసిందే. అయితే ఈ సాహస యాత్రలో మోదీ, బేర్‌ మధ్య జరిగిన సంభాషణ చాలా మందిని సందేహంలో ముంచింది. మోదీ మన................. [news_tags_keywords] => Modi,Bear Grylls,Man Vs Wild [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 22:07:49 [news_isactive] => 1 [news_status] => 2 ) )
గ్రిల్స్‌కి హిందీ అలా అర్థమైంది.. మోదీ - Technology helped Bear Grylls understand Hindi modi - EENADU
close

తాజా వార్తలు

గ్రిల్స్‌కి హిందీ అలా అర్థమైంది.. మోదీ

దిల్లీ: బ్రిటన్‌కు చెందిన సాహసవీరుడు బేర్‌ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని మోదీ చేసిన మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ షో అత్యంత ప్రేక్షాదరణ పొందిన విషయం తెలిసిందే. అయితే ఈ సాహస యాత్రలో మోదీ, బేర్‌ మధ్య జరిగిన సంభాషణ చాలా మందిని సందేహంలో ముంచింది. మోదీ మన జాతీయ భాష హిందీలో మాట్లాడుతుండగా.. బేర్‌ మాత్రం ఆంగ్లంలో మాట్లాడారు. దీనికి సంబంధించి మోదీ ఆదివారం మన్‌ కీ బాత్‌లో ప్రస్తావించారు. అందుకోసం సాంకేతికతను సమర్థంగా వినియోగించుకున్నామని తెలిపారు. ఆయన మాట్లాడిన ప్రతి పదం క్షణాల్లో ఆంగ్లంలో తర్జుమా అయ్యిందని.. అందువల్లే బేర్‌కి తనకు మధ్య భాష అవరోధంగా మారలేదని వివరించారు. ‘‘నేను మాట్లాడిన ప్రతి పదం క్షణాల్లో ఆంగ్లంలోకి అనువాదం అయ్యింది. బేర్‌ గ్రిల్స్‌ చెవిలో వైర్‌లెస్ పరికరం ఒకటి ఉండేది. నేను హిందీలో మాట్లాడితే ఆయన దాన్ని ఆంగ్లంలో వినేవారు. దీంతో మా ఇద్దరి మధ్య సంభాషణ సాఫీగా సాగిపోయింది’’ అని మోదీ వివరించారు.

బేర్‌ గ్రిల్స్‌కి హిందీ ఎలా అర్థమయిందని కార్యక్రమం ప్రసారం అయిన తర్వాత అనేక మంది తనని అడిగారని మోదీ చెప్పారు. తర్వాత ఎడిట్ చేశారా? ఎన్ని రోజులు చిత్రీకరించారు? భాష అవరోధాన్ని ఎలా అధిగమించారు? అని చాలా మంది తనని అడిగారన్నారు. వీటన్నింటినీ అధిగమించడానికి సాంకేతికతకు సమర్థంగా వినియోగించుకున్నామని ప్రధాని వివరించారు.

ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్క్‌లో మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమాన్ని చిత్రీకరించారు. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో డిస్కవరీ నెట్క్‌వర్క్‌పై కార్యక్రమం ప్రసారమైన సంగతి తెలిసిందే.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.