Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009667
            [news_title_telugu_html] => 

భాగ్యనగరంలో మొదలైన గణేశ్‌ శోభాయాత్ర

[news_title_telugu] => భాగ్యనగరంలో మొదలైన గణేశ్‌ శోభాయాత్ర [news_title_english] => ganesh immersion in hyderabad [news_short_description] => హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర మొదలైంది. నేటి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ నిమజ్జనం కొనసాగనుంది. దీంతో నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ఉదయం [news_tags_keywords] => ganesh immersion,hyderabad [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 06:36:56 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భాగ్యనగరంలో మొదలైన గణేశ్‌ శోభాయాత్ర - ganesh immersion in hyderabad - EENADU
close

తాజా వార్తలు

భాగ్యనగరంలో మొదలైన గణేశ్‌ శోభాయాత్ర

హైదరాబాద్‌: భాగ్యనగరంలో గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర మొదలైంది. ఇవాళ్టి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ నిమజ్జనం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ఉదయం ఆరుగంటల నుంచే రంగురంగుల అలంకరణలతో నగరంలో శోభాయాత్ర ప్రారంభమైంది. అయితే హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడుతోంది. అయినప్పటికీ వర్షం మధ్యే ఎన్టీఆర్‌ మార్గ్‌లో భక్తులు విగ్రహాల నిమజ్జనం కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో సుమారు 40వేల వరకు గణనాథుడి ప్రతిమలను గురువారం నిమజ్జనం చేయనున్నారు. ఉదయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగనున్న దృష్ట్యా నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచే అమలవుతున్న దృష్ట్యా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వ్యక్తిగత వాహనాలు తీసుకొస్తే ఇబ్బందులు పడే అవకాశముందని వివరిస్తున్నారు. ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, కూకట్‌పల్లి, గచ్చిబౌలీ వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తామని స్పష్టం చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.