close

తాజా వార్తలు

వేడి తగ్గకుండా తింటేనే ఆరోగ్యం

చలి కొద్దికొద్దిగా పెరుగుతోంది. మరి ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండాలంటే... ఎప్పుడు, ఎలా, ఏం తినాలనేదానిపై మనకో స్పష్టత ఉండాలి. అదేంటంటే...

* మనం తీసుకునే ఆహారం సాధ్యమైనంతవరకూ వేడిగా ఉండేలా చూసుకోవాలి. నూనెల్ని తరచూ మారుస్తుండాలి. అప్పుడప్పుడూ నెయ్యి లేదా ఆవ, నువ్వులు, కొబ్బరినూనె... ఇలా ఏదో ఒకటి ఉపయోగించేలా చూసుకోండి.

* ఒకసారి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యాకే మరోదాన్ని తీసుకోవాలి తప్ఫ.. ప్రతి గంటకు తినాలనే ఆలోచన వద్ధు వీలైనంతవరకూ పోషకాహారం, పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యం ఇస్తే మరీ మంచిది. అప్పుడే జీర్ణాశయంపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.

* అల్లం, మిరియాలు, శొంఠి, వాము... వంటి పదార్థాలను అవకాశం వచ్చినప్పుడల్లా పదార్థాల్లో వాడాలి. ఇవి అజీర్తిని నివారించడమే కాదు, జలుబు, దగ్గు లాంటి సమస్యల్ని అదుపులో ఉంచుతాయి.

* వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఘాటైన మసాలా పదార్థాలు తినాలని మనసు కోరుకోవడం సహజమే కానీ బయట తినే అలవాటుని తగ్గించుకోండి. ఎప్పుడైనా ఒకసారే కదా! అనిపిస్తే ఇంట్లోనే చేసుకోవడానికి ప్రయత్నించండి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.