close

తాజా వార్తలు

ఎన్సీపీ ఎప్పుడూ భాజపాతో చేతులు కలపదు

 ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌

ముంబయి: మహారాష్ట్రలో భాజపా అనూహ్యంగా ప్రభుత్వం ఏర్పాటుచేయడంపై ఎన్సీపీ, శివసేన సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా తొలుత ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మీడియాతో మాట్లాడుతూ.. శివసేన- కాంగ్రెస్‌- ఎన్సీపీ నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించామన్నారు. తమకు 170 మంది సభ్యుల బలం ఉందన్నారు. కొంతమంది స్వతంత్ర ఎమ్మెల్యేలూ మద్దతు తెలిపారన్నారు. అజిత్‌ పవార్‌ది వ్యక్తిగత నిర్ణయమేననీ.. ఆయన పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్నారు. ఆయన నిర్ణయంతో ఎన్సీపీలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. పార్టీ ఫిరాయిస్తే శాసనసభ సభ్యత్వం కూడా కోల్పోతారని ఆయనతో వెళ్లినవాళ్లు గుర్తుంచుకోవాలని పవార్‌ హెచ్చరించారు. అజిత్‌తో కలిసి వెళ్లినవారిలో 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారు. నిజమైన ఎన్సీపీ కార్యకర్తలు, నేతలు ఎప్పుడూ భాజపాతో చేతులు కలపరని శరద్‌ పవార్‌ స్పష్టంచేశారు. రాష్ట్రపతి పాలన ఎత్తివేత, రాజ్‌భవన్‌లో దేవేంద్ర ఫడణవీస్‌ సీఎంగా ప్రమాణస్వీకారోత్సవం గురించి ఈ ఉదయం 6.30 గంటలకు తనకు తెలిసిందని పవార్‌ వెల్లడించారు.

అసెంబ్లీలో భాజపా బలం నిరూపించుకోలేదు:పవార్‌

భాజపా ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోలేదని శరద్‌ పవార్‌ అన్నారు. ఈరోజు సాయంత్రం జరిగే ఎన్సీపీ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభాపక్ష నేత అజిత్‌ పవార్‌ తొలగింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. బేరసారాలకు పాల్పడటం భాజపాకు అలవాటేనని విమర్శించారు. 

మహారాష్ట్రపై భాజపా  సర్జికల్‌ స్ట్రైక్స్‌: ఉద్ధవ్‌
ఎన్సీపీ రెబల్‌గా మారిన అజిత్‌ పవార్‌తో కలిసి మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్రలో భాజపా చర్యను ఓ సర్జికల్‌ స్ట్రైక్స్‌గా అభివర్ణించారు. మహారాష్ట్రలో భాజపా  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు. ప్రజా తీర్పును అవమానించారంటూ తమపై భాజపా నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ తమ ప్రతినిధులను పంపించలేదు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.