close

తాజా వార్తలు

ఆగండి.. మళ్లీ వస్తా: ఫడణవీస్‌

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ రాజకీయ అంకగణితంలో ఓడిపోవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయామని మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. తానే మళ్లీ వస్తానని, అయితే అందుకు కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఎంపికైన సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘‘ప్రజాభీష్టం మేరకు భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. అక్టోబర్‌ 21న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 70 శాతం స్ట్రైక్‌ రేట్‌ వచ్చింది. కానీ రాజకీయ అంకగణితం ముందు మేం ఓడిపోయాం. 40 శాతం మార్కులు సాధించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యంలో మేం భాగస్వాములం కాబట్టి దాన్ని మేం అంగీకరిస్తున్నాం’’ అని దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు.

ఎన్నికలకు ముందు ‘మళ్లీ నేనే వస్తా’ అంటూ ఫడణవీస్‌ చేసిన వ్యాఖ్యలపై సభలో సభ్యలు ఎద్దేవా చేయడంపై ఫడణవీస్‌ స్పందించారు. ‘‘అవును ‘మళ్లీ నేనే వస్తా’ అని అన్నాను. మళ్లీ అదే చెబుతున్నా. అందుకోసం కొంత సమయం వేచి చూడాల్సి ఉంటుంది. నా హయాంలో అనేక ప్రాజెక్టులు ప్రకటించా. వాటికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించా. వాటిని నేనే ప్రారంభిచొచ్చు’’ అని ఫడణవీస్‌ అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.