
తాజా వార్తలు
న్యూదిల్లీ: పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాకిస్థాన్‌పై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న శివసేన నేత సంజయ్ రౌత్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ‘ఈ విషయంలో మేము (అన్ని పార్టీలు) ఐకమత్యంగా ఉన్నామని, పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతామని ఓ తీర్మానాన్ని ఆమోదించాం. గతంలో పఠాన్‌కోట్, ఉరీ ఉగ్రదాడులు జరిగిన సమయంలోనూ తీర్మానాలు ఆమోదించాం. వీటిని ఆమోదించడం మంచిదే కానీ, వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరాం. పాక్‌పై వెంటనే చర్యలు తీసుకునే విషయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అప్పట్లో తీసుకున్న చర్యల గురించి కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవాలి’ అని తెలిపారు.
మరి కొందరు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. ‘ఇటువంటి సున్నితమైన విషయంపై ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ప్రత్యేక శద్ధచూపాలి. వెంటనే తీవ్ర చర్యలు తీసుకోవాలి’ అని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ నేత డి.రాజా మీడియాతో మాట్లాడుతూ... ‘సవాలును ఎదుర్కొంటున్న ఈ సమయంలో మేము భద్రతా బలగాలకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. జమ్ముకశ్మీర్ ప్రజలతో పాటు దేశ ప్రజలకు ప్రభుత్వం భద్రత కల్పిస్తుందన్న భరోసా ఉండాలి. దేశ ఐక్యత, సమగ్రతలను కాపాడడంలో అన్ని విధాల కృషి చేస్తామని ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది’ అని అన్నారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
