Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 135743
            [news_title_telugu_html] => 

రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు మన్మోహన్‌!

[news_title_telugu] => రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు మన్మోహన్‌! [news_title_english] => Ex PM Manmohan Singh may head back to Rajya Sabha [news_short_description] => మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌కు చెందిన మదన్‌ లాల్‌ సైనీ జూన్‌లో... [news_tags_keywords] => Manmohan singh ,Congress,Rajasthan [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-02 14:37:45 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు మన్మోహన్‌! - Ex PM Manmohan Singh may head back to Rajya Sabha - EENADU
close

తాజా వార్తలు

రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు మన్మోహన్‌!

దిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌కు చెందిన మదన్‌ లాల్‌ సైనీ జూన్‌లో మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇందుకు గానూ ఆగస్టు 26న ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ స్థానానికి కాంగ్రెస్‌ తరఫున మన్మోహన్‌ను పంపనున్నట్లు సమాచారం. 

మన్మోహన్‌ సింగ్‌ లాంటి అనుభవజ్ఞులు రాజ్యసభలో ఉండటం ముఖ్యమని భావించిన కాంగ్రెస్ ఆయన్ను పెద్దల సభలో కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదేగనుక జరిగితే ఆయన నాలుగోసారి రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహించిన వారవుతారు. ఇందులో రెండు సార్లు దేశ ప్రధానిగా ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనని పలువురు అనుకున్నారు. తర్వాత ఆయనను తమిళనాడు నుంచి రాజ్యసభకు పోటీ చేయించాలని కాంగ్రెస్‌ భావించింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. గతంలో ఆయన అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన పదవీకాలం జూన్‌ 14న ముగిసింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.