close
తులసీ గబ్బార్డ్‌తో ప్రధాని మోదీ సమావేశం

న్యూయార్క్‌: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ..అగ్రరాజ్యం డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన తులసీ గబ్బార్డ్‌ను కలిశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న భారత సంతతికి చెందిన హిందూ మహిళ ఈమె. ఐక్య రాజ్య సమితి సర్వ సభ్య ప్రతినిధుల సమావేశాన్ని పురస్కరించుకుని మోదీ ఆమెతో సమావేశమయ్యారు. షెడ్యూల్‌ ప్రకారం కాకుండా అనుకోకుండా కలిసి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. అయితే వీరిద్దరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయో తెలియరాలేదు. 

వీరిద్దరూ ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలోనే కలవాల్సి ఉండగా తులసీ ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. హ్యూస్టన్‌ వేదికగా గత ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 50 వేల మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. అయితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందస్తు ప్రణాళికల వల్ల హౌడీ మోదీకి కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని మోదీకి గబ్బార్డ్‌ క్షమాపణలు కూడా చెప్పారు. ఆయన రాకను స్వాగతిస్తున్నానని, హౌడీ మోదీ కార్యక్రమం నిర్వహించడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు.

వార్తలు / కథనాలు

మరిన్ని