close
అమెరికా అబ్బాయి.. పాలమూరు అమ్మాయి

మహబూబ్‌నగర్‌: అమెరికా అబ్బాయి... పాలమూరు అమ్మాయి ఏడు అడుగులు వేసి ఒక్కటయ్యారు. మహబూబ్‌నగర్‌కు చెందిన  వర్షిణి, అమెరికాలోని డల్లాస్‌కు చెందిన హెన్రి హుడ్‌ గిన్స్‌ల వివాహం హైదరాబాద్‌ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది. మహబూబ్‌నగర్‌కు చెందిన వర్షిణి హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేసి నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లింది. అక్కడ ఎంఎస్‌ పూర్తి కాగానే డల్లాస్‌లోని క్యాపిటల్‌ వన్‌ సంస్థలో జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగంలో చేరింది. అదే సంస్థలో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌గా  పని చేస్తున్న హెన్రి హుడ్‌ గిన్స్‌తో  ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని ఇరు కుటుంబాలను ఒప్పించేందుకు గత ఏడాదిగా ప్రయత్నిస్తూ వచ్చారు. చివరకు ఇరు కుటుంబాలు అంగీకారానికి రావడంతో  హిందూ సంప్రదాయం ప్రకారం హైదరాబాద్‌లో పెళ్లి జరగాలని నిర్ణయించారు. పెండ్లి కుమారుడు హెన్రి తరఫున అతని తల్లి, సోదరుడు హాజరుకాగా, వర్షిణి తరఫున ఆమె చిన్నాన్న, చిన్నమ్మతో పాటు దగ్గరి బంధువులు హాజరయ్యారు. ఇవాళ ఉదయం 11.15 గంటలకు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో వారిద్దరి వివాహం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దగ్గరుండి వారి వివాహం జరిపించడంతో పాటు వధూవరులను ఆశీర్వదించారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని