‘అధికారపార్టీ ఆగడాలపై ప్రజలు తిరగబడాలి’
close

తాజా వార్తలు

Published : 16/04/2021 12:17 IST

‘అధికారపార్టీ ఆగడాలపై ప్రజలు తిరగబడాలి’

భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి

తిరుమల: తిరుపతి ఉప ఎన్నిక స్వేచ్ఛగా జరిగే పరిస్థితి లేదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి అన్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో జరుగుతోందని  ఆరోపించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని శుక్రవారం ఉదయం ఆయన దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల విష్ణువర్ధన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలు అధికార పార్టీ ఆగడాలపై తిరగబడాలన్నారు. వాలంటీర్లకు, పోలీసులకు, అధికారులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వైకాపా అధికార దుర్వినియోగంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఓటు వేసేందుకు సుముఖత చూపడం లేదని గుర్తించిన వైకాపా ప్రభుత్వం అడ్డదారుల్లో ఓట్లు వేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని