బెంగాల్‌ దంగల్‌: కాంగ్రెస్‌ ప్రచార తారలు వీళ్లే.. 
close

తాజా వార్తలు

Published : 12/03/2021 18:58 IST

బెంగాల్‌ దంగల్‌: కాంగ్రెస్‌ ప్రచార తారలు వీళ్లే.. 

దిల్లీ: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా మధ్య తారస్థాయిలో కొనసాగుతున్న మాటల యుద్ధం అక్కడ రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి బరిలో దిగిన కాంగ్రెస్‌ కూడా తన సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. రాష్ట్రంలో ప్రచారాన్ని మరింత పదునెక్కించేందుకు ఆ పార్టీ అగ్ర నేతలను రంగంలోకి దించుతోంది. ఈ మేరకు శుక్రవారం 30మంది స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌, రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌, పంజాబ్‌ మాజీ మంత్రి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, అభిజిత్‌ ముఖర్జీ, మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌తో పాటు మొత్తం 30 మందిని ప్రచార తారలుగా ఎంపిక చేస్తూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటన విడుదల చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని