నేరేడుచర్ల పురపాలక సమావేశం ప్రారంభం

తాజా వార్తలు

Updated : 28/01/2020 12:17 IST

నేరేడుచర్ల పురపాలక సమావేశం ప్రారంభం

కాంగ్రెస్‌, తెరాస సభ్యుల మధ్యవాగ్వాదం


 

నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలక సమావేశం ప్రారంభమైంది. తెరాస నేత షేరి సుభాష్‌రెడ్డి ఎక్స్‌ అఫిషియో సభ్యత్వంపై పురపాలిక సమావేశంలో చర్చించారు. ఆయన సభ్యత్వాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధికార పార్టీ అన్యాయానికి పాల్పడుతోందని ఆరోపించింది. మరోవైపు ఎమ్మెల్సీను ఎందుకు నమోదు చేసుకోలేదని కాంగ్రెస్‌ సభ్యులతో తెరాస వాదనకు దిగింది. చైర్‌పర్సన్‌ ఎన్నికకు వెంటనే ఓటింగ్‌ జరపాలని తెరాస పట్టుబడుతుండగా.. నిన్నటి జాబితా ప్రకారమే ఓటింగ్‌ నిర్వహించాలని కాంగ్రెస్‌ అంటోంది. నిన్న ఇద్దరు తెరాస సభ్యులు ప్రమాణస్వీకారం చేశారని కాంగ్రెస్‌ చెబుతోంది. నిన్నటిప్రకారమే ఓటింగ్‌ జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆ పార్టీ సభ్యుడొకరు హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఎదుటే తెరాస, కాంగ్రెస్‌ సభ్యులు పరస్పరం వాగ్వాదానికి దిగారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని