అనవసరంగా కరోనా పరీక్షలు చేయొద్దు!

తాజా వార్తలు

Published : 24/06/2020 01:26 IST

అనవసరంగా కరోనా పరీక్షలు చేయొద్దు!

ప్రైవేటు డయాగ్నోస్టిక్స్‌ ప్రతినిధులతో ఈటల 

హైదరాబాద్‌: కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడొద్దని మంత్రి ఈటల రాజేందర్‌ ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ నిర్వాహకులను కోరారు. పాజిటివ్‌ వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలూ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. కరోనా పరీక్షలు చేస్తున్న డయాగ్నోస్టిక్స్‌ ప్రతినిధులతో హైదరాబాద్‌లో మంత్రి సమావేశం నిర్వహించారు. అనవసరంగా ఎవరికీ పరీక్షలు నిర్వహించొద్దనీ.. ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు నడుచుకోవాలని డయాగ్నోస్టిక్స్‌ను ఆదేశించారు. కొవిడ్‌ పరీక్షలకు వచ్చే ప్రతిఒక్కరూ ఐసోలేషన్‌లో ఉండేలా సూచించాలన్నారు. 

అందరికీ పరీక్షలు అసాధ్యం

కరోనా పరీక్షలపై అనవసర ప్రచారాలు చేయొద్దన్న మంత్రి.. విమానాల్లో వచ్చినవారికి లక్షణాల్లేకపోయినా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయవచ్చన్నారు. ప్రస్తుతం టెస్టింగ్‌ సామర్థ్యం తక్కువగా ఉందని తెలిపారు. అనుమానం, భయంతో వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు వద్దనీ.. దేశంలో అందరికీ పరీక్షలు నిర్వహించడం అసాధ్యమన్నారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని