పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనే ఉండాలి: కేటీఆర్‌

తాజా వార్తలు

Published : 18/07/2021 20:34 IST

పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనే ఉండాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర మంత్రి జితేందర్‌సింగ్‌కు తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. పోటీ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని, హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమం చదువుకోలేని విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోందని మంత్రి కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే  దీనిపై సీఎం కేసీఆర్‌ .. ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారని తెలిపారు. ప్రాంతీయ భాషల సమస్యపై సరైన అమలు విధానం నిర్ణయించే వరకు ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్ల కోసం చేసిన నియామక ప్రక్రియను నిలిపివేయాలని, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా చూడాలని కేంద్ర మంత్రికి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని