సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసనబాట

తాజా వార్తలు

Updated : 25/03/2021 15:18 IST

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసనబాట

హైదరాబాద్‌: సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసనబాట పట్టారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరుతూ నిరసనకు దిగారు.  సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ  మంజూరు చేయాలని, నియోజకవర్గ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ హైదరాబాద్‌లోని లోయర్‌ ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద తన కుమార్తె జయారెడ్డితో కలిసి నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం నుంచి అసెంబ్లీ  వరకు పాదయాత్ర నిర్వహించారు. 

ఈ సందర్భంగా గన్‌‌ పార్క్‌లోని మీడియా పాయింట్‌ వద్ద జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘ నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోవడంతో ట్యాంక్‌ బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశా. సంగారెడ్డిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు  ప్రతిపాదనలు పంపితే సిద్దిపేటకు తరలించారు. 2013లో 5వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే... తెరాస ప్రభుత్వం వచ్చాక వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. నియోజకవర్గంలో 40వేల మంది పేదలు ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వమంటే స్పందన లేదు. కనీసం నియోజవర్గ అభివృద్ధికి  రూ.2వేల కోట్లు ఇవ్వాలని అడిగినా స్పందించడం లేదు. అసెంబ్లీలో మాట్లాడేందుకు మా పార్టీకి కొంచెం సమయం ఇచ్చి మైక్‌ కట్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలి’’ అని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని