ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తాజా వార్తలు

Updated : 11/02/2021 17:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు  కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి-హైదరాబాద్‌, ఖమ్మం-వరంగల్‌-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే వివిధ పార్టీలు...అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదలైంది. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 16న నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

ఎన్నికల ప్రక్రియ ఇలా..

* నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 23
* నామినేషన్ల పరిశీలన -ఫిబ్రవరి 24
* నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ- ఫిబ్రవరి 26
* పోలింగ్‌- మార్చి 14 ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
* ఓట్ల లెక్కింపు మార్చి - 17

 

ఇవీ చదవండి..

హైదరాబాద్‌ మేయర్‌గా విజయలక్ష్మి

స్వేచ్ఛనిచ్చాం.. కానీ చట్టాలను పాటించాల్సిందే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని