పరువునష్టం.. సూరత్‌ కోర్టుకు రాహుల్‌!
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 14:02 IST

పరువునష్టం.. సూరత్‌ కోర్టుకు రాహుల్‌!

సూరత్‌: పరువునష్టం కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ గురువారం గుజరాత్‌లోని సూరత్‌ న్యాయస్థానం ఎదుట హాజరుకానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ గుజరాత్‌ అధ్యక్షుడు అమిత్‌ చావ్డా వివరాలు వెల్లడించారు. కేవలం కోర్టుకు హాజరయ్యేందుకే రాహుల్ సూరత్ వస్తున్నారని స్పష్టం చేశారు. ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లోనూ ఆయన పాల్గొనబోరని తెలిపారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019, ఏప్రిల్‌ 13న కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ పాల్గొన్నారు. ఆ సమయంలో ‘మోదీ’ ఇంటి పేరును ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై భాజపా నేత, సూరత్‌ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ తన మాటలతో మోదీ ఇంటి పేరున్న వారందరి ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఇదే కేసు విచారణ నిమిత్తం 2019, అక్టోబరులోనూ రాహుల్‌ కోర్టు ఎదుట హాజరయ్యారు. తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆ సమయంలో ఆయన కోర్టుకు నివేదించారు. 

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని