TS NEWS: ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్‌ నేతకు గాయాలు
close

తాజా వార్తలు

Updated : 22/07/2021 19:10 IST

TS NEWS: ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్‌ నేతకు గాయాలు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నాయకుల ఫోన్‌ ట్యాపింగ్‌ను నిరసిస్తూ ఇందిరా పార్క్‌ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం ఉద్రిక్తంగా మారాయి. పెగాసస్‌ వ్యవహారంపై ఆందోళనకు దిగిన కాంగ్రెస్‌ శ్రేణులు ఇందిరాపార్కు వద్ద ధర్నా ముగిసిన తర్వాత ర్యాలీగా రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు యత్నించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ ఇందిరా పార్క్‌ వద్ద కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్‌ శ్రేణులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్‌ వెంకట్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతన్ని అబిడ్స్‌లోని ఆదిత్య ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్‌ తీయగా పక్కటెములకు గాయాలైనట్టు వైద్యులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం యశోదా ఆసుపత్రికి తరలించనున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. పోలీసుల అత్యుత్సాహం వల్లే బల్మూర్‌ వెంకట్‌కు గాయాలయ్యాయని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని