close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మహనీయుల చరిత్ర తెరమరుగు చేసే కుట్ర: బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబా ఫులె స్ఫూర్తికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. పేదలకు రాజ్యాధికారం..తెలంగాణలో పేదల పాలన లక్ష్యంగా భాజపా పోరాటం చేస్తోందన్నారు. బర్లు, గొర్ల పంపిణీకే పరిమితం చేస్తూ బీసీలకు సీఎం కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. జ్యోతిబా ఫులె 195వ జయంతి వేడుకల్ని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. చిత్రపటానికి సంజయ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌ నివాళులర్పించారు. అనంతరం సంజయ్‌ మాట్లాడుతూ.. మహనీయుల చరిత్రను తెరమరుగు చేసేందుకు సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ‘అంబేడ్కర్‌, జగ్జీవన్‌ జయంతి, వర్ధంతి రోజుల్లో సీఎం బయటకు రాలేదు. ఫులె జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు రాలేదంటే బీసీల పట్ల అవమానకరంగా వ్యవహరించడమే. బీసీ అంటే..బాయ్‌కాట్‌ చంద్రశేఖర్‌రావు నినాదంతో ఉద్యమించాలి’ అంటూ పిలుపునిచ్చారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు