సముచిత స్థానమిచ్చినా మతతత్వ పార్టీలో చేరతారా?
close

ప్రధానాంశాలు

సముచిత స్థానమిచ్చినా మతతత్వ పార్టీలో చేరతారా?

ఈటలపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శ

జమ్మికుంట, న్యూస్‌టుడే: సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో ఈటల రాజేందర్‌కు సముచిత స్థానమిచ్చి మంత్రిని చేస్తే, దేశాన్ని పీడిస్తున్న మతతత్వ పార్టీ భాజపాలో చేరారని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. గురువారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో తెరాస కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మగౌరవమంటున్న ఈటలకు అసలు ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నదో తెలియడం లేదన్నారు. తన బాధను రాష్ట్రం మొత్తానికి ఆపాదిస్తున్నారన్నారు.భాజపా ప్రభుత్వం పేదలపై పన్నుల భారం వేసి, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచిందని విమర్శించారు. మాజీ మంత్రి ఎలాంటి పార్టీలో చేరారో అందరూ ఆలోచించాలన్నారు. రామగుండం ఎమ్మెల్యే చందర్‌, ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య, పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని