17న హైదరాబాద్‌కు అమిత్‌ షా

ప్రధానాంశాలు

17న హైదరాబాద్‌కు అమిత్‌ షా

అదే రోజు నిర్మల్‌ సభకు...

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాక ఖరారైంది. ఆయన సెప్టెంబరు 17న ఉదయం తొలుత హైదరాబాద్‌ చేరుకుంటారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహం వద్ద... కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి నివాళులర్పిస్తారు. అదే రోజు ప్రధాని మోదీ పుట్టినరోజు కూడా కావడంతో భాజపా తరఫున నిర్వహించే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్‌లో నిర్మల్‌ సభకు పయనమవుతారు. సభ ప్రారంభానికి ముందు... అమిత్‌ షా అక్కడ ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొక్కలు నాటుతారు. ఈ సభకు పార్టీ నేతలు భారీగా సన్నాహాలు చేస్తున్నారు. పెద్దఎత్తున జనసమీకరణతోపాటు వేదిక పక్కనే 20 అడుగుల సర్దార్‌ పటేల్‌ కటౌట్‌ను ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబరు 17 నుంచి.. మోదీ తొలిసారి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అక్టోబరు 7వ తేదీ వరకు పర్యావరణ పరిరక్షణ, వైద్యశిబిరాలు, వ్యాక్సిన్‌పై అవగాహన కల్పన వంటి సేవా కార్యక్రమాలు చేపట్టనున్నామని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని