అక్కడ తేలాల్సింది భాజపా మెజారిటీయే: లక్ష్మణ్‌

ప్రధానాంశాలు

అక్కడ తేలాల్సింది భాజపా మెజారిటీయే: లక్ష్మణ్‌

ఈనాడు, దిల్లీ: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపా గెలుపు ఖాయమని, తేలాల్సింది మెజారిటీ ఎంతనే విషయమేనని భాజపా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. దిల్లీలో సోమవారం జరిగిన భాజపా జాతీయ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక చిన్నదని ప్రచారంలో చెబుతున్న రాష్ట్ర మంత్రులు మరోవైపు భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెరాస, కాంగ్రెస్‌ వేర్వేరు కాదనే విషయం అర్థమైన ప్రజలు కమలంతో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ నెల 22న దిల్లీలో ఓబీసీ మేధావుల సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.

* భాజపా జాతీయ పదాధికారుల సమావేశంలో  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని