రాజకీయ దురుద్దేశంతోనే కులగణన డిమాండ్‌: లక్ష్మణ్‌

ప్రధానాంశాలు

రాజకీయ దురుద్దేశంతోనే కులగణన డిమాండ్‌: లక్ష్మణ్‌

ఈనాడు, దిల్లీ: రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలు కులగణన డిమాండ్‌ చేస్తున్నాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. పరిపాలన, సాంకేతిక, న్యాయపరమైన చిక్కులతోనే కులగణన సాధ్యం కాదని కేంద్రం తెలియజేసిందన్నారు. భాజపా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో దిల్లీలో శుక్రవారం మేధావుల సదస్సు నిర్వహించారు. కేంద్రమంత్రి భూపేందర్‌ యాదవ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. తర్వాత లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు, బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా, మత్స్యకారులకు ప్రత్యేక బడ్జెట్‌, సంచార జాతులకు ప్రత్యేక కమిషన్‌ వంటి ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుందని ఆయన తెలిపారు. ఆర్థికంగా వెనకబడినవర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు కొన్ని కుటుంబాల ప్రయోజనం కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు. వెనకబడిన వర్గాల ప్రయోజనాలను కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలు ఏనాడూ పట్టించుకోలేదన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని