రూ.75 కోట్ల కారు.. ఎవరిదో తెలుసా?

తాజా వార్తలు

Published : 04/08/2020 00:48 IST

రూ.75 కోట్ల కారు.. ఎవరిదో తెలుసా?

ఇలాంటివి ప్రపంచంలో పదే ఉన్నాయట..

ఇంటర్నెట్‌ డెస్క్‌: పోర్చుగల్‌కు చెందిన ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రోనాల్డోను ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరని చెప్పవచ్చు. కార్లను అమితంగా ప్రేమించే ఈ 35 సంవత్సరాల దిగ్గజ ఆటగాడు, ప్రపంచంలోనే అతి ఖరీదైన కారును స్వంతం చేసుకుని మరోసారి వార్తల్లోకెక్కాడు. ఫుట్‌బాల్‌ క్రీడలో పతకాలనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యుత్తమ వాహనాలను స్వంతం చేసుకోవటం ఇతనికి అలవాటు. దీనిలో భాగంగా అతి ఖరీదైన ‘బుగాటీ లా వొయిట్యూర్‌’ కారును కొనుగోలు చేశాడు. విలాసవంతమైన కార్లకు ప్రసిద్ధి చెందిన బుగాటీ, ఇలాంటి కేవలం పది కార్లను మాత్రమే తయారు చేసిందట. కాగా, ఈ కారు విలువ ఇంచుమించు రూ.75 కోట్లు అని తెలిసింది. ఇది అత్యధికంగా గంటకు 380 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదట. అయితే ఈ కారు క్రిస్టియానో రోనాల్డో చేతికందేది మాత్రం 2021లోనే!

క్రిస్టియానో రోనాల్డో వద్ద ఇప్పటికే ఫెరారీ 599 జీటీఓ, లంబోర్గినీ అవెంటాడోర్‌ వంటి పలు అత్యాధునిక, ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇతని గ్యారేజీలో ఉన్న కార్ల మొత్తం విలువ రూ.264 కోట్లకు పైమాటే అని సమాచారం. కార్లే కాకుండా, ఐదు క్యాబిన్లు, ఆరు బాత్‌రూంలు గల విలాసవంతమైన తెరపడవ (యాట్‌)ను కూడా రోనాల్డో గత సంవత్సరం స్వంతం చేసుకున్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని