నాన్నకు బ్రెయిన్‌ క్యాన్సర్‌ అని తెలిసి..  ఆ క్రికెటర్‌

తాజా వార్తలు

Published : 30/08/2020 00:00 IST

నాన్నకు బ్రెయిన్‌ క్యాన్సర్‌ అని తెలిసి..  ఆ క్రికెటర్‌

పాక్‌తో టెస్టు సిరీస్‌ ఆడకపోవడమే సరైన నిర్ణయం

ఇంటర్నెట్‌డెస్క్‌: తన తండ్రికి బ్రెయిన్‌ క్యాన్సర్‌ అని తెలిసి వారం రోజులు నిద్రపట్టలేదని ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అన్నాడు. ఇటీవల పాకిస్థాన్‌తో ఇంగ్లాండ్‌ ఆడిన మూడు టెస్టుల సిరీస్‌ సందర్భంగా అతడు తొలి మ్యాచ్‌ మాత్రమే ఆడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత న్యూజిలాండ్‌లో ఉంటున్న అతడి తండ్రి గెరాడ్‌ స్టోక్స్‌ అనారోగ్యం బారిన పడడంతో మిగతా రెండు టెస్టులు ఆడకుండానే కివీస్‌ ఫ్లైటెక్కాడు. దీంతో అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ శనివారం ఓ స్థానిక పత్రికతో మాట్లాడాడు. ‘ఆ విషయం తెలిసి వారం రోజులు నిద్రపట్టలేదు. నా మనసు నిలకడగా లేదు. జట్టును వీడి రావడమే సరైన నిర్ణయం అనిపించింది’ అని స్టోక్స్‌ చెప్పాడు.

‘చిన్నప్పటి నుంచీ మా నాన్న నా పట్ల కఠినంగా ఉండేవారు. అయితే, నేను పెద్దగయ్యేకొద్దీ ఆయనలా ఎందుకు ఉండేవాడో అర్థమయ్యేది. అందుకు ఒక కారణం ఉంది. నేనొక ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా అవ్వాలనుకుంటున్నాననే విషయం తెలిసి నన్ను అలా క్షమశిక్షణతో పెంచారు. తను ఎలాంటి వ్యక్తి అనే విషయం అతనికున్న పేరు ప్రఖ్యాతులే చెబుతాయి. మా నాన్న గురించి తెలిసిన ఎవర్ని అయినా అడగండి. తనతో పనిచేసిన వాళ్లని లేదా ఆయన దగ్గర శిక్షణ పొందిన వారిని.. ఎలా ఉంటారని అడగండి. అందరూ ఒకటే మాట చెబుతారు.’ అని స్టోక్స్‌ వివరించాడు. ఇదిలా ఉండగా, పాక్‌తో ఆడిన తొలి టెస్టులో విఫలమైన స్టోక్స్‌ అంతకుముందు వెస్టిండీస్‌ ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే గతేడాది ఇంగ్లాండ్‌ వన్డే ప్రపంచకప్‌ గెలవడంలోనూ బెన్‌స్టోక్స్‌ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని