close
Array ( ) 1

తాజా వార్తలు

పృథ్వీ×గిల్‌: తుదిజట్టులో చోటు ఎవరికంటే?

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ, ఓపెనర్ పృథ్వీ షా తుదిజట్టులో ఉంటారని విరాట్‌ కోహ్లీ పరోక్షంగా చెప్పాడు. గాయం నుంచి కోలుకున్న ఇషాంత్‌ లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులు వేస్తున్నాడని, పృథ్వీ బెదురులేని క్రికెట్‌ ఆడుతున్నాడని అన్నాడు. ‘‘గాయపడిన తర్వాత కూడా ఇషాంత్‌ గతంలో మాదిరిగానే కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులు సంధిస్తున్నాడు. అతడు గతంలో ఎన్నోసార్లు కివీస్‌లో క్రికెట్‌ ఆడాడు. అతడి అనుభవం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. అతడు గాయం నుంచి కోలుకుని పేస్‌ అద్భుతంగా వేయడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని కోహ్లీ అన్నాడు.

పృథ్వీ షా గురించి మాట్లాడుతూ.. ‘‘ పృథ్వీకి ఎంతో ప్రతిభ ఉంది. అతడు తన ఆటను అలానే కొనసాగించాలని ఆశిస్తున్నాం. తన ప్రదర్శనపై అతడు నిరాశచెందడు. మయాంక్‌ ఆసీస్‌లో రాణించనట్లుగానే పృథ్వీ న్యూజిలాండ్‌లో రాణిస్తాడు. బెదురు లేని ఎంతో మంది క్రికెటర్లు ఉండటం జట్టుకు మరింత ప్రేరణగా నిలుస్తుంది. పృథ్వీ, మయాంక్‌కు అనుభవం లేదని మీరు అంటుంటారు. కానీ మయాంక్‌ గత ఏడాదిలో ఎన్నో పరుగులు సాధించాడు. అతడు టెస్టు క్రికెట్‌ను ఎంతో అర్థంచేసుకున్నాడు’’ అని తెలిపాడు. 

తొలి టెస్టు తుదిజట్టులో ముగ్గురు పేసర్లతో పాటు ఒక స్పిన్నర్ ఉంటాడని కోహ్లీ పేర్కొన్నాడు. ప్రపంచ స్థాయి స్పిన్నర్‌ ఎలాంటి పిచ్‌పై అయినా సత్తాచాటగలడని అభిప్రాయపడ్డాడు. గత కివీస్‌ పర్యటనకు వచ్చిన బౌలింగ్ విభాగంతో పోలిస్తే ప్రస్తుతం మరింత పటిష్ఠంగా ఉందని తెలిపాడు. అందుకే గత రెండున్నరేళ్లలో ప్రత్యర్థి జట్లను ఆలౌట్‌ చేశామని అన్నాడు. అయితే వికెట్‌కీపర్లు సాహా, పంత్‌.. ఇద్దరిలో తుదిజట్టులో ఎవరికి అవకాశం వస్తుందనే దానిపై కోహ్లీ స్పందించలేదు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌×కివీస్‌ మధ్య తొలి టెస్టు శుక్రవారం ప్రారంభం కానుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.