Dhoni:ఈ బుడ్డోడు ధోనీని మించేలా ఉన్నాడు!

తాజా వార్తలు

Published : 05/06/2021 01:19 IST

Dhoni:ఈ బుడ్డోడు ధోనీని మించేలా ఉన్నాడు!

ఇంటర్నెట్ డెస్క్‌: మహేంద్రసింగ్ ధోనీకి యార్కర్‌ విసిరితే ఏ షాట్‌ ఆడుతాడని ఎవర్ని అడిగినా ఠక్కున చెప్పే సమాధానం.. హెలికాప్టర్‌ షాట్‌. అవును! ఈ షాట్‌ను పరిచయం చేసిందే ధోనీ. తొలుత దీన్ని చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. మెరుపు వేగంతో దూసుకువచ్చే యార్కర్‌ని అంతేవేగంతో తిరిగి బాదడమే ఈ షాట్‌ ప్రత్యేకత. దీన్ని అనుసరించడానికి ఎంతోమంది క్రికెటర్లు ప్రయత్నించారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌ లాంటి ఆటగాళ్లు కొంతమేర సఫలీకృతులయ్యారు. 

అయితే, ఓ బుడ్డోడు అచ్చం ధోనీలాగా హెలికాప్టర్‌ షాట్లను అలవోకగా బాదుతూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. తలకు హెల్మెట్‌ పెట్టుకుని, కాళ్లకు ప్యాడ్లు కట్టుకుని ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ వేషధారణలో మైదానంలో క్రికెట్‌ ఆడుతున్న బుడ్డోడి వీడియోని భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్ చోప్రా ట్విటర్‌లో శుక్రవారం ఉదయం పోస్టు చేశాడు. ఇందులో ఈ బుడ్డోడు.. వచ్చిన బంతిని వచ్చినట్టే బలంగా బాదుతూ కనిపించాడు. హెలికాప్టర్‌ షాట్లతోపాటు లెగ్‌ సైడ్‌ దిశగా ఆడే స్లాగ్‌ స్వీప్‌ని కూడా సునాయాసంగా ఆడాడు. ఒక మోకాలిని నేలకు తాకించి బౌలర్‌ తలమీదుగా ఆడిన షాట్‌ని చూస్తే ఈ బుడ్డోడు ఎంత రాటుదేలిన క్రికెటరో అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోని మీరు కూడా చూసేయండి!
 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని