Rahul Dravid: ఇందిరా నగర్‌ గూండాతో గబ్బర్‌!

తాజా వార్తలు

Updated : 28/06/2021 12:56 IST

Rahul Dravid: ఇందిరా నగర్‌ గూండాతో గబ్బర్‌!

ధావన్‌, ద్రవిడ్‌ జోడీపై నెటిజన్ల కామెంట్లు

ముంబయి: శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఆదివారం రాత్రి బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ‘శ్రీలంక పర్యటనలో భారత జట్టు కోచ్‌, కెప్టెన్‌కు హలో చెప్పండి..! మాకెంతో ఉత్కంఠగా అనిపిస్తోంది. మరి మీకు?’ అని వ్యాఖ్య పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌కు అభిమానుల నుంచి విపరీతంగా మద్దతు లభిస్తోంది.

టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడే సరైన వ్యక్తి అని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోచ్‌గా ‘మిస్టర్‌ డిపెండబుల్‌’ తప్పక రాణిస్తాడని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఆటగాడిగా అదరగొట్టిన శిఖర్‌ ధావన్‌ కెప్టెన్‌గానూ మంచి పేరు తెచ్చుకుంటాడని అభిమానులు అంటున్నారు. ‘రాహుల్‌ ద్రవిడ్‌.. భారత్‌ అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న కోచ్‌’ అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఇంకొందరు అభిమానులు మీమ్స్‌తో అభినందనలు తెలియజేస్తున్నారు. ‘ఇందిరా నగర్‌ గూండాతో దిల్లీ గబ్బర్‌’ అని చమత్కరించారు. ‘ఇంద్రా నగర్‌ గూండా నేను’ అంటూ ద్రవిడ్‌ ఓ ప్రకటనలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

శ్రీలంకతో వన్డే సిరీస్‌ జులై 13న మొదలవుతుంది. 16, 19 తేదీల్లో మిగిలిన వన్డేలు జరుగుతాయి. జులై 22, 24, 27 తేదీల్లో టీ20లు జరుగుతాయి. వన్డేలు మధ్యాహ్నం 1:30 గంటలు, టీ20లు రాత్రి 7 గంటలకు మొదలవుతాయి. వేదిక కొలంబోలోని ప్రేమదాస స్టేడియం.








Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని