గబ్బా టెస్టు రెండో సెషన్‌: ఆసీస్‌ 154/3
close

తాజా వార్తలు

Updated : 15/01/2021 10:34 IST

గబ్బా టెస్టు రెండో సెషన్‌: ఆసీస్‌ 154/3

గబ్బా: టీమ్‌ఇండియాతో ఆడుతున్న నాలుగో టెస్టు రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా ఒక వికెట్‌ కోల్పోయి 89 పరుగులు చేసింది. దీంతో మొత్తం 54 ఓవర్లకు 154/3తో నిలిచింది. ప్రస్తుతం లబుషేన్‌(73*; 167 బంతుల్లో 7x4), మాథ్యూవేడ్‌(27*; 57 బంతుల్లో 5x4) క్రీజులో ఉన్నారు. 65/2తో రెండో సెషన్ కొనసాగించిన ఆస్ట్రేలియా కాసేపటికే జట్టు స్కోర్‌ 87 పరుగుల వద్ద స్టీవ్‌స్మిత్‌(36; 77 బంతుల్లో 5x4) వికెట్‌ కోల్పోయింది. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో రోహిత్‌ క్యాచ్‌ అందుకోవడంతో స్మిత్‌ పెవిలియన్‌ చేరాడు. తర్వాత లబుషేన్‌ అర్ధశతకం సాధించడానికి ముందే రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలుత రహానె అతడి క్యాచ్‌ వదలగా, తర్వాత స్లిప్‌లో పుజారా మరోసారి అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే మాథ్యూవేడ్‌తో కలిసి లబుషేన్‌ అర్ధశతక భాగస్వామ్యంతో కొనసాగుతున్నాడు.

ఇవీ చదవండి..
60 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా 20 మంది ఆటగాళ్లతో.. 
‘అశ్విన్‌ ఒక్కడే 800 వికెట్లు తీస్తాడు’ 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని