PM Modi: అసాధారణం.. హర్లీన్‌కు మోదీ ప్రశంస

తాజా వార్తలు

Updated : 12/07/2021 12:59 IST

PM Modi: అసాధారణం.. హర్లీన్‌కు మోదీ ప్రశంస

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో ఆమె అందుకున్న క్యాచ్‌ అద్భుతమని పొగిడారు. మున్మందు ఇలాగే ఆడాలని ఆకాంక్షించారు. ‘మైగవ్‌ ఇండియా’ పంచుకున్న ఈ వీడియోను మోదీ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు. ‘అసాధారణం.. వెల్‌డన్‌ హర్లీన్‌ డియోల్‌’ అని వ్యాఖ్య పెట్టారు.

నార్తాంప్టన్‌ కౌంటీ మైదానంలో శుక్రవారం రాత్రి టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ మహిళల జట్లు తొలి టీ20లో తలపడ్డాయి. మొదట ఇంగ్లిష్‌ అమ్మాయిలే బ్యాటింగ్‌ చేశారు. అప్పటికే అమీ జోన్స్‌ (43; 27 బంతుల్లో 4×4, 2×6) దూకుడు మీదుంది. వరుసగా బౌండరీలు బాదుతోంది. శిఖా పాండే వేసిన 18.5వ బంతిని భారీ షాట్‌ ఆడింది.

బౌండరీ వద్ద ఆ బంతిని అందుకొనేందుకు హర్లీన్‌ డియోల్‌ అద్భుతమే చేసింది. తల మీదుగా వస్తున్న క్యాచ్‌ను ఎడమవైపు గాల్లోకి డైవ్‌ చేసి అందుకొంది. ఈ క్రమంలో బౌండరీ అవతల పడిపోతానని తెలుసుకొని బంతిని గాల్లోకి విసిరింది. బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ గాల్లోని బంతిని అందుకొనేందుకు మైదానంలోకి డైవ్‌ చేసింది. దాంతో విస్తుపోయిన అమీ జోన్స్‌ నిరాశతో పెవిలియన్‌ చేరింది.

ఈ వీడియో ఇంటర్నెట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎంతోమంది క్రికెటర్లు, అభిమానులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు హర్లీన్‌ను అభినందించారు. తాజాగా మోదీ సైతం ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టడం ఆశ్చర్యం కలిగించింది. అయితే తొలి టీ20 ఓడిపోయిన హర్మన్‌సేన రెండో మ్యాచులో విజయం సాధించింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని