కోహ్లీ, రోహిత్, ధోనీ.. ముగ్గురూ ముగ్గురే! 

తాజా వార్తలు

Updated : 24/05/2021 18:33 IST

కోహ్లీ, రోహిత్, ధోనీ.. ముగ్గురూ ముగ్గురే! 

సచిన్‌ అంతకుమించి: సూర్యకుమార్‌ యాదవ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ క్రికెట్‌ను తన ఊపిరిగా అభివర్ణించాడు. అలాగే తాను క్రికెటర్‌ కాకపోయుంటే నటుడిగా రాణించేవాడినని చెప్పాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించాడు సూర్యకుమార్‌. వారడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ఈ ముంబయి బ్యాట్స్‌మన్‌ జవాబులిచ్చాడు.

క్రికెట్‌లో తనకిష్టమైన షాట్ స్వీప్‌షాట్‌ అని చెప్పిన సూర్య టీమ్‌ఇండియా దిగ్గజ క్రికెటర్లపైనా తన అభిప్రాయాలు వ్యక్తపరిచాడు. ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో పాటు మాజీ సారథులు మహేంద్రసింగ్‌ ధోనీ, సచిన్‌పై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ స్ఫూర్తిదాయకమైన ఆటగాడని, రోహిత్‌ హిట్‌మ్యాన్‌ అని పేర్కొన్నాడు. అలాగే ధోనీ దిగ్గజం అని కీర్తించాడు. ఇక మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ను దేవుడితో పోల్చాడు. కాగా, క్రికెట్‌లో సచిన్‌ను ‘గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌’గా అభిమానులు భావిస్తారనే సంగతి తెలిసిందే.

అలాగే ముంబయి ఇండియన్స్ తన కుటుంబంలాంటిదని చెప్పిన సూర్య..  బిర్యాని తనకిష్టమైన ఆహారమన్నాడు. బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ ఇష్టమైన నటుడని.. ఒకవేళ తాను క్రికెట్‌ను కెరీర్‌గా ఎంపికచేసుకోకపోతే నటనపై దృష్టిపెట్టేవాడినని తెలిపాడు. 2019, 20 ఐపీఎల్‌ సీజన్లలో ముంబయి ఇండియన్స్‌ వరుసగా రెండుసార్లు కప్పు సాధించడం తనకెంతో ఇష్టమైన సందర్భాలని గుర్తుచేసుకున్నాడు. ఇక హార్దిక్‌ పాండ్యపై స్పందిస్తూ.. అతడో ఎంటర్‌టైనర్ అని సూర్యకుమార్‌ పొగిడాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని