తొలి మ్యాచ్‌లోనే సూర్యకుమార్‌ యాదవ్‌..!

తాజా వార్తలు

Published : 12/03/2021 13:32 IST

తొలి మ్యాచ్‌లోనే సూర్యకుమార్‌ యాదవ్‌..!

(Photo: Surya Kumar Yadav Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌ కీలక బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ నిరీక్షణకు తెరపడే క్షణాలు దగ్గరయ్యాయి. టీమ్‌ఇండియా తరఫున ఆడాలనే కోరిక ఇంగ్లాండ్‌తో నేడు జరగబోయే తొలి టీ20తో నిజమయ్యే అవకాశం ఉంది. గతమూడేళ్లుగా అటు దేశవాళి, ఇటు ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నా సూర్యకుమార్‌కు టీమ్‌ఇండియా యాజమాన్యం నుంచి పిలుపురాలేదు. గతేడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేస్తారని భావించినా అదీ నెరవేరలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన అతడు తర్వాత పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకుసాగాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇంగ్లాండ్‌తో పొట్టి సిరీస్‌కు ఎంపికయ్యాడు.

అయితే, సూర్య తొలి టీ20లోనే అరంగేట్రం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గురువారం జరిగిన మీడియా సమావేశంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ విషయాన్ని బయటకు చెప్పకపోయినా సూర్యకుమార్‌ పరోక్షంగా తెలిపాడు. సాహిల్‌ఖాన్‌ అనే ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సూర్య తొలి మ్యాచ్‌లోనే అరంగేట్రం చేస్తున్నాడు. అతడికి శుభాకాంక్షలు’ అంటూ పోస్టు పెట్టాడు. దానికి స్పందించిన సూర్య తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఆ పోస్టును పంచుకొని అవునని అర్థం వచ్చేలా వివరించాడు. దీంతో ఇంగ్లాండ్‌తో నేడు జరిగే తొలి టీ20లోనే ఈ ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ బరిలోకి దిగి అవకాశం ఉందని అర్థమవుతోంది. అయితే, ఇది అధికారిక ప్రకటన కాకపోవడంతో చివరి క్షణాల వరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని