మిథాలి రాజ్‌గా బ్యాటింగ్‌ చేస్తున్న తాప్సీ 

తాజా వార్తలు

Updated : 28/01/2021 12:26 IST

మిథాలి రాజ్‌గా బ్యాటింగ్‌ చేస్తున్న తాప్సీ 

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటి తాప్సీ సినీ అభిమానులనే కాకుండా క్రికెట్‌ అభిమానులనూ అలరించడానికి సిద్ధమయ్యారు. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం ‘శభాష్‌ మిథు’. టీమ్‌ఇండియా మహిళా వన్డే జట్టు సారథి మిథాలి రాజ్‌ జీవిత కథ ఆధారంగా తెరకిక్కిస్తున్న ఈ సినిమాలో తాప్సీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాహుల్‌ ధొలాకియా ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాప్సీ బ్యాటింగ్‌ చేయడం నేర్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఒక ఫొటోను ట్విటర్‌లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడే బ్యాట్‌, బంతితో ప్రయాణం మొదలుపెట్టాను. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అయితే, ఇప్పటికే సగం పని పూర్తి అయినందుకు సంతోషంగా ఉంది. ఇది టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్లతో పాటు, కెప్టెన్‌ కూల్‌ మిథాలి రాజ్‌కు మరో మైలురాయిగా నిలుస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు. 

కాగా, ఈ చిత్రానికి సంబంధించి తాప్సీ గతేడాది జనవరి 29నే ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. టీమ్‌ఇండియా జెర్సీ ధరించి మైదానంలో బ్యాటింగ్‌ చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘‘పురుషుల క్రికెట్‌లో నా ఫేవరెట్‌ ఎవరని ఎప్పుడూ నన్ను అడుగుతుంటారు. కానీ, మహిళల క్రికెట్‌లో మీ ఫేవరెట్‌ ఎవరని వారిని(టీమ్‌ఇండియా ఆటగాళ్లు) అడగాలి’’ అనే వ్యాఖ్యలతో ప్రతి క్రికెట్‌ అభిమానిని.. తాము ఆటను ప్రేమిస్తున్నామా లేక ఆడుతున్న వ్యక్తిని ప్రేమిస్తున్నామా అనే రీతిలో ఆలోచింపజేసిన మిథాలి రాజ్‌ గేమ్‌ ఛేంజర్‌’’ అని ట్వీట్‌ చేశారు. అంతకుముందు 2019 మిథాలిరాజ్‌ పుట్టినరోజు సందర్భంగా తాప్సీ  ప్రాజెక్ట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ రోజు మిథాలితో కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఇక గతేడాది థప్పడ్‌ సినిమాతో మంచి విజయం అందుకున్న ఆమె ఈ బయోపిక్‌లో ఏ మేరకు ఆకట్టుకుంటారో వేచి చూడాలి. 

ఇవీ చదవండి..
సిరాజ్‌కు నాతో చీవాట్లు పెట్టించుకోవడం ఇష్టం 
జట్టంతా భావోద్వేగానికి గురైన క్షణమది: శార్దూల్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని