close
సెమీస్‌లో పేస్‌ జోడీ

న్యూపోర్ట్‌: 46 ఏళ్ల వయసులోనూ భారత వెటరన్‌ దిగ్గజ టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ సత్తాచాటుతున్నాడు. మార్కస్‌ డానియల్‌ (న్యూజిలాండ్‌)తో కలిసి అతను హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఓపెన్‌ ఏటీపీ టోర్నీ పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో అడుగుపెట్టాడు. శనివారం క్వార్టర్స్‌లో పేస్‌- మార్కస్‌ జోడీ 6-4, 5-7, 14-12 తేడాతో మాథ్యూ ఈడెన్‌ (ఆస్ట్రేలియా)- రాబర్ట్‌ లిండ్‌స్టెడ్‌ (స్వీడన్‌) జంటపై విజయం సాధించింది. సెమీస్‌లో పేస్‌- మార్కస్‌ ద్వయం.. మార్సెల్‌- సెర్గీతో తలపడనుంది. జాన్‌ మెకన్రో (47) తర్వాత ఏటీపీ టూర్‌ టోర్నీలో సెమీస్‌ చేరిన రెండో పెద్ద వయస్సు ఆటగాడిగా పేస్‌ రికార్డు నమోదు చేశాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.