close

ప్రధానాంశాలు

Updated : 16/09/2020 18:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అబుదాబిలో అర్జున్‌ తెందూల్కర్‌కు ఏం పని?

సచిన్‌ తెందూల్కర్‌ తనయుడు అర్జున్‌ అబుదాబికి ఎందుకు వెళ్లాడు? ముంబయి ఇండియన్స్‌తో ఎందుకు కలిసి ఉంటున్నాడు? ఆటగాళ్లతో కలిసి ఎందుకు ఎంజాయ్‌ చేస్తున్నాడు? ముంబయి అతడితో ఒప్పందం కుదుర్చుకుందా? ఐపీఎల్‌-2020లో అతడు అరంగేట్రం చేస్తాడా?

ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లతో కలిసి ఈత కొలనులో అర్జున్‌ కనిపించడంతో సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రశ్నలివి. అయితే ముంబయి యాజమాన్యం అతడితో ఇప్పటికీ ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిసింది. నెట్‌బౌలర్‌గానే యూఏఈకి తీసుకెళ్లిందని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి. గతంలోనూ అతడు వాంఖడేలో ముంబయికి నెట్‌బౌలర్‌గా పనిచేశాడు. ఎడమ చేతివాటం పేసర్ కావడంతో అతడికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడూ అదే ఉద్దేశంతో అర్జున్‌ను అక్కడికి పిలిపించారు.

కరోనా వైరస్‌ ముప్పు వల్ల అన్ని ఫ్రాంచైజీలు పరిమిత వనరులతోనే యూఏఈకి చేరుకున్నాయి. ప్రత్యేకంగా కొందరు నెట్‌బౌలర్లను తీసుకెళ్లాయి. దేళవాళీ క్రికెట్లో ఎక్కువగా ప్రతిభ చూపిస్తున్న వారినే ఎంచుకున్నాయి. ఎందుకంటే ఒకవేళ అనుకోని కారణాలతో ఎవరైనా ఆటగాళ్లు టోర్నీ మధ్యలో దూరమైతే వీరిని ఆడించాలని భావిస్తున్నాయి.

అర్జున్‌ సైతం బౌలింగ్‌తో ప్రతిభ కనబరుస్తున్నాడు. గతంలో టీమ్ఇండియాకూ నెట్స్‌లో బంతులు విసిరాడు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా మహిళా జట్టుకూ బంతులు వేశాడు. అందుకు కొన్ని రోజుల ముందే అతడు విసిరిన యార్కర్‌కు గాయపడి జానీ బెయిర్‌స్టో ప్రాక్టీస్‌ సెషన్‌కు దూరమయ్యాడు. కాబట్టి ఎవరైనా ఆటగాడు గాయపడి టోర్నీకి దూరమైతే అతడిని తీసుకోవాలని ముంబయి భావిస్తోందట. ఎందుకంటే అర్జున్‌.. బ్యాటింగ్‌ సైతం చేయగలడు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.