జడేజాకు చపాతి పరిమాణంలో చాలు..
close

ప్రధానాంశాలు

Published : 14/06/2021 02:16 IST

జడేజాకు చపాతి పరిమాణంలో చాలు..

సిడ్నీ: టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవీంద్ర జడేజా సత్తా చాటేందుకు పిచ్‌పై చపాతి పరిణామంలో చిన్నగా పాద ముద్రలు (ఫుట్‌మార్క్స్‌) ఉంటే చాలని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో జడేజా, అశ్విన్‌ కచ్చితంగా న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడతారని తెలిపాడు. ‘‘ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు జడేజా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. చపాతి పరిణామంలో పాద ముద్రలున్నా అతడికి చాలు. అదే ప్రాంతంలో నిలకడగా బంతుల్ని సంధిస్తాడు. ఫైనల్లో జడేజా, అశ్విన్‌  కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడం ఖాయం. ఇక ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా యువ జట్టు సత్తా చాటింది. టన్నులకొద్దీ పరుగులు సాధించిన ప్రపంచ స్థాయి కెప్టెన్‌ లేకపోయినా యువ ఆటగాళ్లు రెట్టించిన ఉత్సాహంతో మమ్మల్ని ఓడించడం గొప్ప విషయం. ఐపీఎల్‌, రాహుల్‌ ద్రవిడ్‌లదే ఈ ఘనత. సరైన వ్యవస్థ ద్వారా యువ ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెటర్లుగా సిద్ధం చేస్తున్న ద్రవిడ్‌ అద్భుతంగా పని చేస్తున్నాడు. వాళ్లు ఆసీస్‌లో ఆడినప్పుడు ఆ విషయం స్పష్టమైంది. ఇప్పుడున్నట్లుగానే భవిష్యత్తులోనూ టెస్టు క్రికెట్లో టీమ్‌ఇండియా దుర్బేధ్యంగా ఉంటుంది’’ అని వార్నర్‌ పేర్కొన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 52
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 53
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

)
మరిన్ని

దేవతార్చన