Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 173956
            [news_title_telugu_html] => 

మన చేపలు విదేశాలకూ ఎగుమతి కావాలి 

[news_title_telugu] => మన చేపలు విదేశాలకూ ఎగుమతి కావాలి  [news_title_english] => [news_short_description] => నీటి మీద ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపి తద్వారా నీలి విప్లవం తీసుకురావాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/G_OgZ_zLtYs [news_videoinfo] => |https://www.youtube.com/embed/G_OgZ_zLtYs [news_sections] => ,30,29, ) )
మన చేపలు విదేశాలకూ ఎగుమతి కావాలి  - EENADU
close
మన చేపలు విదేశాలకూ ఎగుమతి కావాలి 

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

కాళేశ్వరం, న్యూస్‌టుడే: నీటి మీద ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపి తద్వారా నీలి విప్లవం తీసుకురావాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. విదేశాలకూ తెలంగాణ చేపలు ఎగుమతి కావాలని చెప్పారు. ఎంపీ బండా ప్రకాశ్‌తో కలిసి శుక్రవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత ఉభయ నదుల ప్రవాహం పుష్కరఘాట్ల వద్ద చేపపిల్లలను నీటిలోకి వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని పెద్దపల్లి, జయశంకర్‌, మంచిర్యాల జిల్లాల పరిధిలో 1.04కోట్ల చేప, రొయ్య పిల్లలను విడుదల చేయాల్సి ఉండగా కాళేశ్వరం వద్ద 3.76 లక్షల చేపపిల్లలను నీటిలోకి వదిలారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరమని, యావత్‌ భారతదేశం ఇక్కడి నిర్మాణాలను చూస్తుందని చెప్పారు. ఇక్కడ మత్స్యకారులున్నారని, చెరువులున్నాయని గత పాలకులెవరూ గుర్తించలేదని, చేపలు అమ్మాలన్నా, కొనాలన్నా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మీద ఆధారపడాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూ.వందల కోట్లు వ్యయం చేసి చేపపిల్లలు పంపిణీ చేస్తోందన్నారు. గతేడాది రూ.700కోట్లతో 60వేల ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను మత్స్యకారులకు అందించామని తెలిపారు. సొసైటీ సభ్యులకు పూర్తిస్థాయిలో బీమా పథకం ఉందని, జూన్‌ 19 నుంచి అమలవుతోందన్నారు. సొసైటీ సభ్యులకు ఎడ్యుకేషన్‌ రుణం వర్తిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జయశంకర్‌ జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ శ్రీహర్షిణి, పెద్దపల్లి జిల్లా జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మత్స్యశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ సువర్ణ పాల్గొన్నారు.

42 లక్షల చేప పిల్లల పంపిణీ 
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: నాలుగో విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 20 జిల్లాల్లోని 52 నీటి వనరుల్లో 42.28 లక్షల చేపపిల్లలు వదిలినట్లు మత్స్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 24,954 నీటి వనరుల్లో 80.8 కోట్ల చేపపిల్లలు, 26 లక్షల రొయ్యపిల్లలను విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలిరోజు అత్యధికంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 11 ట్యాంకుల్లో 5.42 లక్షలు, ఖమ్మంలో 5 లక్షలు, కాళేశ్వరంలో 3.76 లక్షలు, జనగామ జిల్లాలోని 15 నీటి వనరుల్లో 2.91 లక్షల చేప పిల్లలను వదిలారు. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 4, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోని 3 నీటి వనరుల్లో పిల్లలను విడుదల చేసినట్లు మత్స్యశాఖ తెలిపింది.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.