close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎయిమ్స్‌ మంగళగిరి, బీబీనగర్‌లకు విదేశీ వైద్య పరికరాలు

ఈనాడు, దిల్లీ: కరోనాతో అల్లాడుతున్న భారత్‌కు చేయూత అందించడానికి ప్రపంచ దేశాల నుంచి వచ్చిన 24 రకాలైన 40 లక్షల వస్తువులను మంగళగిరి, బీబీనగర్‌ ఎయిమ్స్‌ సహా దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 38 సంస్థలకు పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో బైపాస్‌మిషన్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు, పీఎస్‌ఏ ప్లాంట్లు, పల్స్‌ ఆక్సీ మీటర్లు, ఫావిపిరవిర్‌, రెమ్‌డెసివిర్‌లాంటి మందులు, పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు, గౌన్లు ఉన్నట్లు తెలిపింది. ఈనెల 2వ తేదీన రూపొందించిన ప్రామాణిక నిబంధనలను అనుసరించి వీటిని రాష్ట్రాలకు పంపిణీ చేస్తామంది. విదేశాల నుంచి అందిన సాయం తక్కువ పరిమాణంలో ఉందని, తొలుత క్రియాశీలక కేసుల భారం అధికంగా ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చామంది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు