TSPSC:టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారం

ప్రధానాంశాలు

TSPSC:టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారం

ఈనాడు, హైదరాబాద్‌ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌గా ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కరోనా కారణంగా నిరాడంబరంగా నాంపల్లిలోని కమిషన్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషన్‌ తాత్కాలిక ఛైర్మన్‌ సాయిలు నూతన ఛైర్మన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కమిషన్‌ ముఖ్యకార్యదర్శి వాణిప్రసాద్‌, కొత్తగా నియమితులైన సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత సభ్యులు రమావత్‌ ధన్‌సింగ్‌, ప్రొఫెసర్‌ బి.లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్‌ తనోబా, కారెం రవీందర్‌రెడ్డి, డాక్టర్‌ ఎరవెల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్‌.సత్యనారాయణతో జనార్దన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని