ఏపీ ఇంటర్‌, పది పరీక్షలు జులైలో

ప్రధానాంశాలు

ఏపీ ఇంటర్‌, పది పరీక్షలు జులైలో

ఈనాడు, అమరావతి: కరోనా కేసులు తగ్గుతుండడంతో జులైలో పది, ఇంటరు పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది. జులై మొదటి వారంలో ఇంటరు, చివరి వారంలో పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మంగళవారం ప్రకటించారు. సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని, విద్యార్థుల ప్రయోజనాల కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కరోనా లేకపోతే పరీక్షలకు ఇబ్బందులు ఏమీ ఉండవని పేర్కొన్నారు. ఏపీలో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ ఉన్నందున ఆ తర్వాత విద్యార్థులకు 15 రోజుల సమయం ఇచ్చి పరీక్షలను నిర్వహించేందుకు ఇంటరు విద్యామండలి షెడ్యూలు రూపొందించింది. అనుమతి కోసం ప్రభుత్వానికి పంపింది. జులై 7నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు 10లక్షలకుపైగా విద్యార్థులు హాజరు కానున్నారు. పదో తరగతి పరీక్షలను జులై 26 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.  ఆగస్టులో ఇంజినీరింగ్‌, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల(ఈఏపీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని