ప్రణాళికలే మీ బాధ్యత

ప్రధానాంశాలు

ప్రణాళికలే మీ బాధ్యత

డీటీసీపీకి నిర్దేశించిన పురపాలకశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో టీఎస్‌-బీపాస్‌ విధానం అమలు నేపథ్యంలో డీటీసీపీ పూర్తి స్థాయిలో ప్రణాళికా విధులనే నిర్వహించాలని పురపాలక శాఖ ఆదేశించింది. కొన్ని నెలలుగా భవన నిర్మాణాలు, లేఅవుట్‌లకు అనుమతుల దరఖాస్తులను టీఎస్‌-బీపాస్‌ విధానంలోనే స్వీకరించి అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో పట్టణ, గ్రామీణ ప్రణాళిక డైరెక్టర్‌ (డీటీసీపీ) విధులను పురపాలక శాఖ నిర్దేశించింది. డీటీసీపీ పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి అవసరమైన అంశాలనే చేపట్టాలని స్పష్టం చేస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నియంత్రణకు సంబంధించిన అంశాల జోలికి పోకుండా ప్రధాన బాధ్యత అయిన ప్రణాళికలను మాత్రమే రూపొందించాలని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని