తెలంగాణ సాధనలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి: సీఎం కేసీఆర్‌

ప్రధానాంశాలు

తెలంగాణ సాధనలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి: సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళాచైతన్యానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొనియాడారు. సాయుధ పోరాట కాలంలోనే హక్కుల సాధన కోసం, చట్టం పరిధిలో, కోర్టుల్లో న్యాయం కోసం కొట్లాడిన గొప్ప ప్రజాస్వామికవాది అని ప్రస్తుతించారు. ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, భావితరాలు గుర్తుంచుకునే విధంగా మరిన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. ఐలమ్మ 126వ జయంతి (సెప్టెంబరు 26) సందర్భంగా సీఎం ఆమె ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. అత్యంత వెనుకబడిన కులం(ఎంబీసీ)లో జన్మించిన ఆమె తెలంగాణ బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాత అని సీఎం తన సందేశంలో తెలిపారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సత్యవతి రాథోడ్‌, సబితారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు ఐలమ్మకు నివాళులర్పించారు. ఆమె సాహసం అసమానమని, అందరికీ ఆదర్శప్రాయమని ప్రశంసించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని