Dentons: ‘డెంటన్స్‌’లో విశాఖ మహిళకు కీలక పదవి

ప్రధానాంశాలు

Dentons: ‘డెంటన్స్‌’లో విశాఖ మహిళకు కీలక పదవి

ఈటీవీ - విశాఖపట్నం: ప్రపంచంలో అతిపెద్ద ‘లా సంస్థ’గా గుర్తింపు పొందిన ‘డెంటన్స్‌’లో మానవ వనరుల విభాగానికి అధిపతిగా నీలిమ పాలడుగు నియమితులయ్యారు. ఒక భారతీయురాలికి ఈ తరహా కంపెనీలో గ్లోబల్‌ చీఫ్‌ పీపుల్స్‌ ఆఫీసర్‌గా పదవి దక్కడం ఇదే తొలిసారి. విశాఖకు చెందిన నీలిమ పాలడుగు ప్రస్తుతం అమెరికాలోని డెల్లాయిట్‌’ కంపెనీలో ‘గ్లోబల్‌ పీపుల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌’గా పని చేస్తున్నారు. ఏకంగా 205కి పైగా దేశాలలో విస్తరించిన డెంటన్స్‌లో నవంబరు 15న చేరనున్నారు. ఇందులో దాదాపు 20 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 12 వేల మంది వరకు న్యాయవాదులు ఉంటారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని