పెంచిన ప్రేమకు బందీని!

ప్రధానాంశాలు

పెంచిన ప్రేమకు బందీని!

ఇంటివాకిట.. ఇదేంటి? కోళ్లతో కలసి ఈ నెమలి ఇంత స్వేచ్ఛగా పురివిప్పి ఆడుతోంది!...అంటూ ఆశ్చర్యపోకండి. అందుకో నేపథ్యం ఉంది లెండి.. ఇది అడవి నుంచి ఎగురుకుంటూ ఇక్కడకు రాలేదు. ఇక్కడే పుట్టింది. ఇక్కడే పెరిగింది. అదెలా అంటే.. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం నాగోబాగూడ గ్రామస్థులు సమీప అటవీ ప్రాంతంలో దొరికిన నెమలి గుడ్డును తీసుకొచ్చారు. ఇంటి వద్ద పొదుగుతున్న కోడిగుడ్లకు దాన్నీ కలిపారు. కొన్ని రోజులయ్యాక కోడి పిల్లలతో పాటు నెమలి పిల్లా పుట్టింది. తల్లి కోడి తన పిల్లలతో పాటు దాన్ని సైతం కంటికి రెప్పలా కాచుకుంటూ వచ్చింది. అలా పెంచిన ప్రేమకు అది కట్టుబడిపోయింది. ఇప్పటికీ కోళ్లతో, కోడిపిల్లలతో కలిసి మెలసి తిరుగుతుంది. ఇళ్ల వెంబడి హాయిగా ఎగురుతూ ఉంటుంది. గ్రామస్థులు కూడా దాన్ని అపురూపంగా చూసుకుంటారు. వాతావరణం చల్లబడినప్పుడల్లా అది పురివిప్పి నాట్యం చేస్తూ గ్రామంలో సందడి సృష్టిస్తుంటుంది.

  -ఈనాడు, ఆదిలాబాద్‌. న్యూస్‌టుడే, ఉట్నూరు గ్రామీణం


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని