close

ప్రధానాంశాలు

అమ్మాయైతే సర్కారు బడికే!

4-8 ఏళ్ల వయసు విద్యార్థుల్లో  56.80% మంది బాలికలే
14వ ఆసర్‌ నివేదిక వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌

ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 8 ఏళ్ల వయసున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది బాలికలే. ప్రైవేట్‌ బడుల్లో మాత్రం బాలుర ప్రవేశాల సంఖ్య అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. మగపిల్లల్ని ప్రైవేట్‌ పాఠశాలలకు, ఆడపిల్లలైతే సర్కారు బడులకు పంపించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నట్లు నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. ప్రథమ స్వచ్ఛంద సంస్థ మంగళవారం విద్యా వార్షిక స్థాయి నివేదిక(ఆసర్‌) 2019ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లోని 26 జిల్లాల్లో ఈ సర్వే జరిగింది. 1,778 గ్రామాల పరిధిలో 30,425 ఇళ్లకు వెళ్లి 36,930 మంది విద్యార్థుల విషయాలు సేకరించి నివేదికను రూపొందించారు. తెలంగాణలో కరీంనగర్‌, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లాలో సర్వే జరిపారు.

నివేదిక ముఖ్యాంశాలు

* 4-8 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లల్లో 90 శాతానికి పైగా ఏదో ఒక విద్యాసంస్థలో ప్రవేశాలు పొందారు. నాలుగేళ్ల వయసువారు 91.3% మంది, 8 సంవత్సరాల వయసువారు 99.50% మంది ఆయా పాఠశాలల్లో చదువుకుంటున్నారు.
* ఐదేళ్ల వయసు పిల్లల్లో 70% మంది అంగన్‌వాడీలు లేదా పూర్వ ప్రాథమిక తరగతుల్లో చేరారు. మరో 21.60% మంది అప్పటికే ఒకటో తరగతిలో ఉన్నారు. ఆరేళ్ల ప్రాయంలో అంగన్‌వాడీలు, పూర్వ ప్రాథమిక తరగతుల్లో ఉన్నవారు 32.80 శాతమే. మిగిలిన వారిలో 46.40% ఒకటో తరగతి, 18.70% రెండో తరగతిలో ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో...

* తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాలో 4 ఏళ్ల వయసు పిల్లల్లో 96% మంది పూర్వ ప్రాథమిక(ఎల్‌కేజీ/యూకేజీ) తరగతుల్లో ఉన్నారు. 1.5% ఒకటీ లేదా ఆపై తరగతుల్లో ఉన్నారు. 2.5% మంది ఇంకా దేంట్లోనూ చేరలేదు.

* పూర్వ ప్రాథమిక తరగతుల్లో ఉన్న 96% మందిలో 41.50% అంగన్‌వాడీల్లో, 6.5% ప్రభుత్వ బడుల్లో, 48.40% మంది ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎల్‌కేజీ/యూకేజీ చదువుతున్నారు.
* ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో 4 ఏళ్ల వయసు పిల్లల్లో 94.30% మంది పూర్వ ప్రాథమిక విద్య, 4.30% మంది ఒకటో తరగతి, ఆపైన చదువుతున్నారు. మరో 1.40% ఇంకా ఎక్కడా చేరలేదు. వారిలో 72.60% మంది అంగన్‌వాడీల్లో, 1.50% మంది ప్రభుత్వ బడుల్లో, 20.20% ప్రైవేట్‌ బడుల్లో ఎల్‌కేజీ/యూకేజీలో చేరారు. ఒకటీ, ఆపై తరగతుల్లో ఉన్నవారిలో 2.90% సర్కారు, 1.40% ప్రైవేట్‌లో చేరారు.
 దేశవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో 4-8 ఏళ్ల వయసు బాలికలు, బాలుర శాతం (వరసగా)

విద్యార్థుల వయసు ప్రభుత్వ  పాఠశాలలు (సం.లలో)    బాలికలు         బాలురు
           4-5                                     56.80           50.40
           6-8                                    61.10            52.10

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.